![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -461 లో... ధీరజ్ డల్ గా ఉంటే తన మూడ్ ని డైవర్ట్ చెయ్యడానికి ప్రేమ వస్తుంది. ఒరేయ్ నా జుట్టు తడిగా ఉంది తుడువవా అని ధీరజ్ ని ప్రేమ అడుగుతుంది. దాంతో ధీరజ్ చిరాకుపడతాడు. నాపై నీకు కోపం ఉంది కదా గొడవ జరగడానికి కారణం నేనే అనుకుంటున్నవ్ కదా అని ప్రేమ అంటుంది. అదేం లేదు తుడుస్తానని తన జుట్టుని టవల్ తో తుడుస్తాడు ధీరజ్.
అప్పుడే కార్ షోరూం వాళ్ళు ధీరజ్ కి ఫోన్ చేస్తారు. మీరు కార్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చారు కదా రేపు రాకుంటే క్యాన్సిల్ అవుతుందని చెప్తారు. దాంతో ధీరజ్ క్యాన్సిల్ చెయ్యమని చెప్తాడు. ఇక ప్రేమ ఫోన్ తీసుకొని రేపు ఈవెనింగ్ వచ్చి డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకుంటామని చెప్తుంది.
డబ్బు ఎక్కడిది అని ధీరజ్ అంటాడు. నేను చూసుకుంటాను కదా.. మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇస్తానని అన్నారని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ధీరజ్ వెళ్ళాక ప్రేమ తన నగలు తీసుకొని ఇంతకంటే వేరే మార్గం లేదురా, నిన్ను తక్కువ చేసి చూడడం నాకు ఇష్టం లేదని నగలు తన బ్యాగ్ లో వేసుకుంటుంది.
ఆ తర్వాత శ్రీవల్లి బెల్ పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. భాగ్యంకి ఫోన్ చేసి మావయ్య గారు బెల్ ఇచ్చారు.. ఏం అవసరం ఉన్నా బెల్ కొట్టమని చెప్పారు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నానని వల్లి అనగానే... నిన్ను కాళ్ళు పట్టుకునేలా చేస్తారా.. నీ ఇగో చల్లారే వరకు వాళ్ళకి పనులు చెప్పమని భాగ్యం సలహా ఇస్తుంది.
ఆ తర్వాత వల్లి దగ్గరకి చందు వచ్చి ఏమైనా తినాలనిపిస్తే చెప్పమని అంటాడు. నాకు హాల్వా తినాలని ఉందని శ్రీవల్లి చెప్తుంది.
మరొకవైపు నగలు పట్టుకొని ప్రేమ బ్యాంక్ కి వెళ్తుంది. నువ్వు భద్రవతి మేనకోడలు కదా అని అడుగుతాడు అక్కడి మేనేజర్. ఇక ప్రేమ డైవర్ట్ చేస్తూ.. నాకు అర్జెంట్ గా డబ్బు కావాలని ప్రేమ అంటుంది. కాసేపు వెయిట్ చెయ్యండి అని మేనేజర్ అంటాడు. ఆ తర్వాత మేనేజర్ సేనాపతికి ఫోన్ చేసి మీ కూతురు నగలు తాకట్టు పెట్టి డబ్బు కావాలని అంటుందని చెప్తాడు. సరే మీరు రేపు ఇస్తానని చెప్పండి అని సేనాపతి చెప్తాడు. ఇక రేపు ఇస్తాను అమ్మ బ్యాంకులో ఇప్పుడు అంత డబ్బు లేదని ప్రేమతో మేనేజర్ చెప్తాడు.
ఆ తర్వాత ప్రేమని తీసుకొని వెళ్ళడానికి ధీరజ్ వస్తాడు. ఏంటే ఇక్కడ బ్యాంక్ ఉంది, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఏదో ల్యాండ్ మార్క్ కోసం బ్యాంకు అడ్రెస్ చెప్పాను.. నీకు అన్ని డౌట్స్ అని ప్రేమ కవర్ చేస్తుంది. డబ్బు అరెంజ్ అయిందా అని ధీరజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |